ఆశీర్వదిస్తే.. అభివృద్ధి చేస్తా..!

23 Nov, 2018 12:48 IST|Sakshi
మాట్లాడుతున్న స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌రెడ్డి  

స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌రెడ్డి ప్రచారం..

సాక్షి, మక్తల్‌: నియోజకవర్గ ప్రజలందరు ఎన్నికల్లో గెలిపిస్తే ఎంతో బుణపడి ఉంటానని, మక్తల్‌కు సేవ చేయాలన్నాదే నా ధ్యేయమని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు.

తాగునీటి వసతి, రోడ్డను అభివృద్ధి చేయడం వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మక్తల్, మాగనూర ఊట్కూర్, నర్వ, ఆత్మకూర్, కృష్ణ, అమరచింత మండాలాల కార్యకర్తలు తనవైపు ఉన్నారన్నారు. తనపై నమ్మకం పెట్టి చేరిన వారికి నేను అండగా ఉంటానన్నారు. అలాగే అనంతరం పస్పుల గ్రామంలో జలంధర్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి పస్పులలో కృష్ణమ్మ తల్లికి పూజలు చేసి ప్రచారం నిర్వంహించారు.

ఇంటింటికి తిరుగుతూ జలంధర్‌రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నియోజకవర్గ నాయకుడు ఆశిరెడ్డి, మక్తల్‌ మాజీ సర్పంచ్‌ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ గంగాధర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, పురం వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాబుల్‌రెడి, నీలప్ప, రంజిత్‌రెడ్డి, అబ్ధుల్‌హూసేన్, వెంకటేష్, మల్లేష్, శ్రీకాంత్‌రెడ్డి, దామెదర్‌రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.


సోమేశ్వర్‌బండలో పలువురి చేరిక 
మక్తల్‌ మండలం సోమేశ్వర్‌బండలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు అసమ్మత్తినాయకులు ఆశిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నారాయణరెడ్డి సమక్షంలో చేరారు. అందరు జలంధర్‌రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు