వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

21 Feb, 2015 14:24 IST|Sakshi

నల్గొండ: వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జిల్లాలోని సూర్యపేటలో శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులను హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తుండగా వారు పోలీసులకు పట్టుబడ్డారు.

 

హైదరాబాద్ నుంచి కొంతమంది యువతులను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సూర్యపేటలో నిఘా ఉంచడంతో ఇరువురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.

మరిన్ని వార్తలు