‘ప్రజావాణి’ పరిష్కారమేది?

6 Nov, 2018 15:46 IST|Sakshi
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం

    69 దరఖాస్తులు

    స్వీకరించిన జేసీ రాజేశం

    పరిష్కారంలో తాత్సారం చేస్తున్న అధికారులు

జగిత్యాల టౌన్‌: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో అర్జీలు ఇచ్చినవారే అదే సమస్యపై పదేపదే వస్తున్నారు. పరిష్కారం విషయంలో అధికారులు మాత్రం అలసత్వం వీడడంలేదు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జేసీ రాజేశం పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి 69 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, పింఛన్, వివిధ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. డబుల్‌బెడ్‌రూం కోసం అర్బన్‌లో 3,రూరల్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 7 మంది వివిధ సమస్యలపై ఫోన్‌ ద్వారా సమస్యలను విన్నవించుకున్నారు

ఖబ్రస్తాన్‌ ప్రహరీ పూర్తి చేయాలి
మా గ్రామంలో ఉన్న ఖబ్రస్తాన్‌ ప్రహరీ నిర్మాణం కోసం ఏడాదిన్నర క్రితం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. నిధులతో ఖబ్రస్తాన్‌ గోడ నిర్మాణం చేపట్టి కాంట్రాక్టర్‌ మధ్యలోనే వదిలేశాడు. అధికారులు స్పందించి నిర్మాణం పూర్తిచేయాలించాలి.          
 - ముస్లిం కమిటీ సభ్యులు, 

అర్పపల్లి, సారంగాపూర్‌ మండలం                                                                                                                                                                                       

 సబ్సిడీ వాహనాలు అందలేదు 
ప్రభుత్వం గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేసిన సబ్సిడీ వాహనాల కోసం 24 మంది దరఖాస్తులు చేసుకున్నాం. దరఖాస్తుతోపాటు సంబంధిత సొమ్మును డీడీల రూపంలో  చెల్లించాం. మూడు నెలలు అవుతున్నా  ఎలాంటి స్పందన లేదు. డీడీలు అందజేసిన వారికి వాహనాలు అందించాలి. 
- గంగపుత్ర సంఘం సభ్యులు, కొడిమ్యాల      

       ఈ ఫొటోలోని బాలుడిపేరు కాముని నవీన్‌. రాయికల్‌ మండలం కుమ్మరిపల్లికి చెందిన లక్ష్మి–నర్సయ్యల కుమారుడు. కొన్నేళ్లుగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నాడు. రెండేళ్ల క్రితం వికలాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సదరెం క్యాంప్‌లో అందజేసిన సర్టిఫికెట్‌ తీసుకురావాలని కోరడంతో క్యాంప్‌కు హాజరయ్యా డు. ఇలా ఆరుసార్లు సదరెం క్యాంప్‌నకు హా జరైనా అధికారులు సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. అసలే పేద కుటుంబం.. ఆపై కుమారుడి వైకల్యంతో తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం అందించే పింఛన్‌ అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సదరెం సర్టిఫికెట్‌ జారీ చేసేలా చూడాలని సోమవారం కూడా జేసీకి దరఖాస్తు ఇచ్చారు.    

మరిన్ని వార్తలు