‘సగర ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు కేటాయించాలి’

4 May, 2019 03:08 IST|Sakshi

ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

హైదరాబాద్‌: సగర ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి 12 ఏళ్లు గడుస్తున్నా ఫెడరేషన్‌కు పాలకమండలి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే పాలకమండలిని ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సగరుల డిమాండ్ల సాధన కు ఈ నెల 7న సగర హక్కుల పోరాట సమితి చైర్మన్‌ నీరడి భూపేశ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద చేపడుతున్న భగీరథ దీక్ష పోస్టర్‌ను శుక్రవారం బర్కత్‌పురాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణతో కలసి ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న సగరుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిన సగరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సగరుల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి ఆర్ధింగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని అన్నారు.  

మరిన్ని వార్తలు