బాన్సువాడలో గాలివాన బీభత్సం

27 May, 2018 13:55 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : బాన్సువాడ సబ్‌ డివిజన్‌లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు పలు ఇంటి రేకుల షెడ్లు ఎగిసి పడ్డాయి. గాలివానకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, ఇళ్లపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌లు, మామిడి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు సైతం నేలకొరిగాయి. కరెంట్‌ స్తంభాలతో పాటు వైర్లు కూడా తెగిపడడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు