నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్‌..

28 Apr, 2020 01:55 IST|Sakshi

మంత్రి అయినా ఎమ్మెల్యేకు తెలియకుండా పర్యటించొద్దు 

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: ‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుపీరియర్, బాస్‌. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎవరైనా సరే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పర్యటించొద్దు..’అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్‌ ఎవరైనా సరే ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే నియోజకవర్గంలోకి రావాలన్నారు.

అలాకాకుండా వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుందని, ఎవరైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏ ప్రపోజలయినా అధికారులు ఎమ్మెల్యే ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏవిధంగా జరుగుతుందో ఘన్‌పూర్‌లో కూడా అలాగే జరుగుతుందని.. జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటివారైనా సహించేది లేదని తెలిపారు.  చదవండి: ‘కొండపోచమ్మ’కు డెడ్‌లైన్‌ మే 15..  

మరిన్ని వార్తలు