బుద్ధుడికి నివాళులర్పించిన రాష్ట్రపతి

21 Dec, 2017 02:24 IST|Sakshi

ఆయన వెంట డిప్యూటీ సీఎం 

మహమూద్‌ అలీ, గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి,హైదరాబాద్‌ : హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఉదయం 10.20 గంటలకు గవర్నర్‌ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతో కలసి బుద్ధ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ బౌద్ధ గురువుల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం విశేషాలతో పాటు దేశంలోనే నాలుగో అతి పెద్ద జెండా అయిన సంజీవయ్య పార్కులోని జాతీయ పతాకం విశేషాలను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు ఇతర అధికారులు వివరించారు.

కార్యక్రమంలో సీఎస్‌ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, మేయర్‌ రామ్మోహన్‌లు ఘనంగా వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు