రూ.12.5 కోట్ల బుద్ధుడి విగ్రహం చోరీ.. కానీ అమ్మడం కష్టమేనట!

24 Sep, 2023 19:24 IST|Sakshi

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ ఆర్ట్ గ్యాలరీలో 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్ కాంస్య బుద్ధ విగ్రహం ఇటీవల చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం మీడియాకు తెలిపింది. గ్యాలరీ గేట్‌ను బద్దలు కొట్టి ట్రక్కుతోపాటు లోపలికి దుండగుడు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. 

ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603-1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్ బరాకత్ చెప్పారు. అద్భుతమైన ఈ కళాఖండం 55 సంవత్సరాల క్రితం ఆయన స్వాధీనంలోకి వచ్చింది. ఇలాంటిది మరెక్కడైనా ఉంటుందని తాను అనుకోనని గ్యాలరీ డైరెక్టర్ పాల్ హెండర్సన్  న్యూయార్క్ పోస్ట్‌తో తెలిపారు . నాలుగు అడుగుల పొడవు, లోపుల బోలుగా ఉండే ఈ కాంస్య విగ్రహం చాలా ప్రత్యేకమైందని, దీన్ని చోరీ చేసిన వ్యక్తి అమ్మడం చాలా కష్టమని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు