జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ | The First Meeting Of Jamili Election High Level Committee Today, Know In Details - Sakshi
Sakshi News home page

Jamili Elections: జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ

Published Sat, Sep 23 2023 7:22 AM

Jamili Committee first meeting Today - Sakshi

ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. 

ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. 

జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ కూడా ఈ కమిటీలో ఉన్నారు. 

ఇదీ చదవండి: Tender Voting: టెండర్‌ ఓటింగ్‌ అంటే ఏమిటి?

Advertisement
Advertisement