స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్‌

16 Nov, 2017 05:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో ప్రస్తుతం 48 ప్రాంతాల్లో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయాలు విక్రయిస్తున్నామని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలో మరో 52 ప్రాంతాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు. రహదారులకు సమీపంలో స్థలాలను సమీకరించి ఇస్తే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మండలిలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు కాంగ్రెస్‌ పాలకులు రాష్ట్రానికి అనుకూలం గా వాదనలు వినిపించకుండా అన్యాయం చేశారని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ట్రిబ్యునల్‌తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌  స్వామిగౌడ్‌ తిరస్కరించారు.   

మరిన్ని వార్తలు