ఓటర్ల జాబితాపై సమీక్ష

20 Mar, 2019 15:40 IST|Sakshi
నాయకులతో మాట్లాడుతున్న ఈఓఆర్డీ రాజేశ్వరి  

సాక్షి, కూసుమంచి: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోపు ఎంపీడీఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తహసీల్దారు స్వర్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. వివిధ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు నిషేధమని అన్నారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొల్లంపల్లి సుధాకర్‌రెడ్డి, ఆసిఫ్‌పాషా, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, బీజేపీ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల అధ్యక్షుడు ఉపేందర్‌తో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కవిరాజ్, సురేష్, ఎంసీఓ అంజిరెడ్డి పాల్గొన్నారు. 


తిరుమలాయపాలెం: ఎంపీటీసీల ఓటర్ల జాబితా ముసాయిదాపై మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో మండల పరిషత్‌ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎంపీటీసీల వారీగా ప్రదర్శించిన ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచిన ఓటరు జాబితాపై ఈ నెల 25 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని మండల ఈఓఆర్డీ రాజేశ్వరి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు ఈశ్వర్, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు