మనసున్న మహారాజులు

27 Dec, 2017 02:49 IST|Sakshi

‘సాక్షి’ కథనానికి స్పందించిన దాతలు

శిరీష ఆపరేషన్‌కు సాయమందిస్తామన్న ‘పెద్ది’

సీఎం సహాయనిధి వచ్చేలా చూస్తామని హామీ

దాతల ద్వారా ఒక్క రోజులోనే రూ.1,00,100

దుగ్గొండి (నర్సంపేట): ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అంపశయ్యపై శిరీష’ కథనానికి దాతలు స్పందించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రేగుల శోభన్‌–సౌందర్యల ఆవేదన.. కిడ్నీలు పాడైన యువతి శిరీష (21) దీనావస్థను ఈ నెల 25న ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాలకు ఎందరో మనసున్న మహారాజులు స్పందించి చేసిన సాయంతో మంగళవారం ఒక్క రోజులోనే రేగుల శోభన్‌ ఖాతాలో రూ.1,00,100 జమ అయ్యాయి.

29 మంది తమ మానవత్వాన్ని చాటి ఈ సాయాన్ని అందించారు. అలాగే, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానానికి రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పందించారు. శిరీష కిడ్నీ మార్పిడి చికిత్సకు సుమారు రూ.6 లక్షల వ్యయం అవుతుందని, అందులో రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సçహాయ నిధి నుంచి అందించేందుకు కృషి చేస్తానని, ఆపరేషన్‌ కంటే ముందే సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఒప్పించి ఎల్‌ఓసీనీ తీసుకువచ్చి ఆపరేషన్‌ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని అ«ధైర్యపడవద్దని సూచించారు. శిరీషకు సాయం చేయాలనుకునేవారు రేగుల శోభన్‌ 7732045246 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌చేసి గాని, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 62112812530 (ఎస్‌బీఐ ఐఎఫ్‌ఎస్‌సీ నం.0021561)  బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేయవచ్చు.

మరిన్ని వార్తలు