ఈ పోలీస్‌ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్‌

26 Oct, 2023 12:31 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ‍ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్‌ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. 

సెమ్రీ హర్‌చంద్‌లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్‌ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్‌లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్‌లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. 

సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? 
 

మరిన్ని వార్తలు