'భరోసా యాత్రతో కేసీఆర్ ఢిల్లీ పరిగెత్తిండు'

10 Oct, 2014 17:31 IST|Sakshi
'భరోసా యాత్రతో కేసీఆర్ ఢిల్లీ పరిగెత్తిండు'

హైదరాబాద్: విద్యుత్ సమస్యపై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనంటూ తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత షబ్బీర్ అలీ... ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రతి సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... విద్యుత్ సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన కేటీఆర్కు తాను సద్దమే అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. విద్యుత్ అందుబాటులో లేదని తెలిసినప్పటికీ రైతులకు 8 గంటలు కరెంట్ ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చారని కేటీఆర్ ను ప్రశ్నించారు.

ఇది రైతులను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. 8 గంటలు కరెంట్ ఇవ్వలేనందు వల్ల ముందుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కరెంట్ కోతల వల్ల జరిగిన పంట నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర మొదలు పెట్టేసరికి... సీఎం కేసీఆర్ ఉన్న పళంగా కరెంట్ కావాలంటూ కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ పరిగెత్తిండు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం వల్లే... రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తించుకోవాలని షబ్బీర్ అలీ హితవు పలికారు.

మరిన్ని వార్తలు