Chattisgarh CM : సీఎం రేసులో డిప్యూటీ సీఎం..!

1 Dec, 2023 16:39 IST|Sakshi
photo courtesy : Hindustan Times

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే రానుందని ఎగ్జిట్‌ పోల్స్ ప్రెడిక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి సీఎం ఎవరనేదానిపై రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌దేవ్‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పడం సంతోషంగా ఉంది. అయితే ఈసారి మేం అటు ఇటుగా 60 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. హై కమాండ్‌ నిర్ణయించిన వ్యక్తిని సీఎంగా ఏకగగ్రీవంగా ఎన్నుకుంటాం. రెండున్నరేళ్ల పవర్‌ షేరింగ్‌ లాంటి ప్రతిపాదనలేవీ లేవు’ అని సింగ్‌ దేవ్‌  చెప్పారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌ సింగ్‌ దేవ్‌ సీఎం పదవి కోసం పోటీపడ్డారు. అయితే భూపేష్‌ భగేల్‌ను ఆ పదవి వరించింది. ఈ ఏడాది జూన్‌ దాకా క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న సింగ్‌దేవ్‌ను జూన్‌లో డిప్యూటీ సీఎంగా నియమించారు. తాజాగా కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందన్న అంచనాల నేపథ్యంలో సింగ్‌ దేవ్‌ మళ్లీ సీఎం రేసులోకి రావడం విశేషం.

ఇదీచదవండి..ఆ ఆటలన్నీ ఆడాం: టన్నెల్‌ వర్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌


 

మరిన్ని వార్తలు