సర్వేలో అప్పుల కాలమ్ ఏదీ?

19 Aug, 2014 09:27 IST|Sakshi

సమగ్ర కుటుంబ సర్వేకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సంజీవయ్య నగర్లో ఆటంకాలు ఎదురయ్యాయి. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన వాళ్లు సర్వే చేయడానికి వచ్చిన ఎన్యుమరేటర్లను అడ్డుకున్నారు. సర్వే జాబితాలో అప్పులకు సంబంధించిన వివరాలు నమోదు చేయడానికి కాలమ్ ఎందుకు పెట్టలేదని మండిపడ్డారు. మరోవైపు వరంగల్‌ నగరంలో ఇంటి నెంబర్లు దొరకక ఎన్యుమరేటర్లు ఇంకా రోడ్డు మీదే తిరుగుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కూడా ఎన్యుమరేటర్లు ఒక్కొక్కళ్లకు భారీ సంఖ్యలో ఇళ్లు కేటాయించడంతో అన్ని ప్రాంతాలకు తిరగడం ఒక్క రోజులో పూర్తవుతుందా.. లేదా అని ఆందోళన చెందుతున్నారు. ముందు రెండు రోజులు స్టిక్కర్లు అతికించడం, పాంప్లెట్లు పంచడం, ఇళ్లు గుర్తించడం లాంటి పనులే సరిపోయాయని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీల్లో ఇళ్లు అక్కడక్కడ ఉన్నచోట్ల సమస్య అవుతోందని కొంతమంది ఎన్యుమరేటర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు