సామాజిక చైతన్యం రావాలి

15 Apr, 2014 03:07 IST|Sakshi

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సామాజిక స్వాతంత్య్రం సాధించాలని, అప్పుడే బడుగులు అభివృద్ధి చెందుతారని  కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. సాంఘి క సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాజ్యంగ నిర్మాత, దళిత ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ 124జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక చైతన్యం రావాలని, అప్పుడే హక్కులను సాధించుకోవచ్చన్నారు. ప్ర పంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక్క గొప్ప రాజ్యాంగా న్ని దే శానికి అందించిన ఘనత అం బేద్కర్‌కే దక్కిందన్నారు.
 
అణగారి ని వర్గాల అభ్యున్నతి కోసం రా జ్యాంగంలో అనేక హక్కులను క ల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువు ద్వారానే మనకు గు ర్తింపు వస్తుందన్నారు. సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు, దురాచారాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చదువు కోసం అనేక పథకాలను అమలు చేస్తుంద ని తెలిపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం అందరూ ప్రయత్నిం చాలని సూచించారు.
 
కార్యక్రమం లో ఎస్పీ నాగేంద్రకుమార్, జేసీ శర్మణ్,  డీఆర్‌డీఏ పీడీ చంద్ర శేఖర్‌రెడ్డి, ఆర్‌డీఓ హనుమంత్‌రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్, డీఎస్‌డబ్ల్యూఓ శ్రీనివాస్‌రావు, ఏ ఎస్‌డబ్ల్యూఓ రాములు అధికారులు సత్యనారాయణ, సబిల్, జీవన్, చంద్రశేఖర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు