ఆవిర్భావ వేడుకలు అదిరిపోవాలి

26 May, 2018 12:57 IST|Sakshi
వీసీలో పాల్గొన్న ఉన్నతాధికారులు      

వీడియో కాన్ఫరెన్స్‌లో పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌

నాగర్‌కర్నూల్‌ :  రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జూన్‌ 2న అదిరిపోయేలా నిర్వహించడానికి జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ ఆదేశించారు. రాష్ట్ర అవతర వేడుకలపై శుక్రవారం వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా కలెక్టర్లు, జేసీలు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడారు.

గతంలో నిర్వహించిన మాదిరిగానే జిల్లా స్థాయిలో పలు రంగాల్లో విశిష్ట సేవలు ఆందించిన ప్రముఖులకు రూ. 51,116లు నగదు పురస్కారాలు అందించాలని, అమరవీరులకు నివాళులు అర్పించాలని, పెద్ద ఎత్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చేపాట్టాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉత్సవాలకు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనాథ శరణాలయాల్లో విద్యార్థులకు పండ్లు, మిటాయిలు పంపిణీ చేయాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ఇదివరకే ప్రతిపాధనలు పంపిన 686 మంది వృద్ధ  కళాకారులకు 1500 చొప్పున పింఛన్‌ మంజూరు చేశామని, జిల్లా నుంచి 20 దరఖస్తులు పంపించాలన్నారు.

ఈ సందర్భంగా జేసి సురేందర్‌ కరణ్‌ జిల్లాకు సంబంధించిన సమాచారం అందించారు. వీసీలో డీఆర్వో మధుసూదన్‌ నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు