పటిష్టంగా గిరిజన పథకాల అమలు

14 Jul, 2018 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గిరిజనులకు మేలు చేసేలా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని ఆ శాఖాధికారులను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు.   శుక్రవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను సీఎస్‌ సమీక్షించారు.  గిరిజన  విద్యాసంస్ధల ద్వారా 2 లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

ట్రైబల్‌ మ్యూజి యంకు ప్రాచుర్యం కల్పించి, ఎక్కువమంది సంద ర్శించేలా చూడాలని కోరారు. రూ. 205 కోట్లతో 16,479 మందికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళిక రూపొందించామని, ఈ ఏడాది ఐదువేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు.  2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని, కల్యాణలక్ష్మి ద్వారా రూ.150 కోట్లతో 3,400 మందికి సహాయం అందించాలని నిర్ణయించామన్నారు.

కాగా, ట్రై ఫెడ్‌ ఎండీ ప్రవీణ్‌కృష్ణ సీఎస్‌తో భేటీ అయ్యారు. గిరిజన అటవీ ఉత్పత్తులకు ఎంఎస్పీ, వన్‌ధన్‌ వికాస కేంద్రాల ఏర్పాటు, అటవీ ఉత్పత్తులు, మార్కెటింగ్‌ సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ వివరించారు.

మరిన్ని వార్తలు