విషాదంలోనూ విజయం..

15 Jun, 2019 01:34 IST|Sakshi
కుమారుడు హనీస్‌ సత్యకు మిఠాయి తినిపిస్తున్న తండ్రి శ్రీనివాసరావు

టీఎస్‌ ఐసెట్‌లో మొదటి ర్యాంక్‌ సాధించిన హనీస్‌ సత్య

10 నెలల క్రితం తల్లి కల్యాణి గుండెపోటుతో మృతి

ఫస్ట్‌ ర్యాంక్‌తో తల్లి ఆకాంక్షను నెరవేర్చిన కుమారుడు  

హైదరాబాద్‌: పది నెలల క్రితం ఆ ఇంట్లో సంతోషాలు దూరమైనా.. ఆ విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. శుక్రవారం విడుదలైన టీఎస్‌ఐసెట్‌ ఫలితాల్లో మొదటి ర్యాంక్‌ సాధించి తన తల్లి ఆకాంక్షను నెరవేర్చాడు. హనుమాన్‌పేట్‌కు చెందిన రైల్వే ఉద్యోగి మండవ శ్రీనివాసరావు, కల్యాణి దంపతులు. వారికి కుమారుడు హనీస్‌ సత్య, కుమార్తె హర్షిత ఉన్నారు. తల్లి కల్యాణి 10 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు.

హనీస్‌ గండిపేటలోని ఎంజీఐటీలో ఇంజనీరింగ్‌ చదువుతుండగా.. హర్షిత శ్రీకాకుళంలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. గత నెల 23న ఐసెట్‌ పరీక్ష రాసిన హనీస్‌.. శుక్రవారం విడుదలైన ఐసెట్‌ ఫలితాల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించా డు. ఈ సందర్భంగా హనీస్‌ మాట్లాడుతూ.. ఎంబీఏ చేసి మంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవ్వాలనుందని, ఉస్మానియా వర్సిటీలో సీటు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హనీస్‌ కు చదువంటే మొదటి నుంచి ఇష్టమని, మొదటి ర్యాంక్‌ తెచ్చుకొని తల్లి కోరికను తీర్చాడని తండ్రి శ్రీనివాసరావు, నాయనమ్మ వెంకటమ్మ అన్నారు. 

మరిన్ని వార్తలు