‘నేను సాధారణం.. పనులు అసాధారణం’

3 Jun, 2020 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ మన జీవన విధానంలో భాగంగా మారబోతున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను, రాష్ట్రావతరణ దినోత్సవాన్ని కలిపి ఆమె నిర్వహించారు. లాక్‌డౌన్‌ సమయంలో కనెక్ట్‌ చాన్స్‌లర్‌ పేరుతో వర్సిటీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ రచనలకు ఈ సందర్భంగా ఆమె పురస్కారాలు ప్రదానం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆమె గోశాలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను సాధారణమైన మనిషినే అయినప్పటికీ పనులు మాత్రం అసాధారణంగా ఉంటాయన్నారు. ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌లో ఉండగానే ఆ కాలేజీలో పనిచేసే సౌందరరాజన్‌తో పెళ్లి జరిగిందని, అది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నారు. తన ఎదుగుదలలో సౌందరరాజన్‌ తోడ్పాటు ఎంతో ఉందని గుర్తు చేశారు. (అమరవీరుల త్యాగాల ఫలమే తెలంగాణ)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు