రోడ్డుపై చెత్త వేసిన టీచర్‌కు రూ. 5వేల జరిమానా

3 Oct, 2019 02:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్‌ రూరల్‌ : రోడ్డుపై చెత్త వేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పంచాయతీ అధికారులు రూ. 5వేల జరిమానా వేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా నర్కూడలో జరిగింది. నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డుపై ఉదయం చెత్తను గమనించిన ఆ గ్రామ సర్పంచ్‌ సిద్దులు, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ ఈ విషయమై ఆరా తీశారు. అక్కడి చెత్త కాగితాల్లో ఒక ప్రభుత్వ టీచర్‌కు పోస్ట ల్‌ బ్యాలెట్‌ పేపరు, పాత చెక్కులు, ఐడీ కార్డులు వారికి లభించాయి. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆ వ్యక్తిని నాగోల్‌కు చెందిన మల్లారెడ్డిగా గుర్తించి ఆయనను పిలిపించి జరిమానా విధించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు