అసంతృప్తులపైనే ఆశలు

10 Sep, 2018 09:20 IST|Sakshi

భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చే స్థాయిలో పార్టీ నాయకులు లేకపోవడంతో.. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపై దృష్టి సారించింది. అసమ్మతి నాయకులను అక్కున చేర్చుకుని, టికెట్‌ ఇచ్చి ప్రత్యర్థులకు గట్టి సవాలు విసరాలని యోచిస్తోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: బలమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ.. వివిధ పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన నేతలపైనే ఆశలు పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. టీఆర్‌ఎస్‌ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, కదన రంగంలోకి దూకేసింది. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపి క, టీడీపీతో పొత్తు.. సీట్ల సర్దుబాటు.. వంటి వా టిపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు దశ లో ఉన్నారు. కా నీ, బీజేపీలో మాత్రం ఈ దూకుడు పెంచకపోవడంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఇం కా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ఆ పా ర్టీ ప్రధానంగా నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియో జక వర్గాల్లో మూడు, నాలుగు మినహా మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థులే కరువయ్యారు. ఈ నేప థ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ టికెట్ల కోసం ప్రయ త్నాలు చేసి, అక్కడ అవకాశం దక్కని నేతలకు గాలం వేయాల ని కమల దళం యోచిస్తోంది.

కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఒక్క కామారెడ్డి అభ్యర్థిత్వంపైనే ప్రస్తుతానికి స్పష్టత వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణా ల లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వస్తోంది. జహీరాబాద్‌ ఎంపీగా బరిలోకి దిగాలని ఆయన యోచించి, కొంతకాలంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందుబాటు ఉండలేదు. ముఖ్యంగా నాగిరెడ్డిపేట్‌ వంటి మండలాల వైపు తొంగి చూసి న దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డిలో ఆ పార్టీ ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్యే బి.జనార్ధన్‌గౌడ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఆయన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. బాన్సువాడలో ప్రస్తుతం బీజేపీకి నియోజకవర్గ స్థాయి నేత కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో నిజామాబాద్‌ అర్బన్‌కు చెంది న నేతలను బరిలోకి దించే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. జుక్కల్‌లోనూ దాదాపు ఇ లాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ కూడా చెప్పుకోదగిన అభ్యర్థి కోసం ఆ పార్టీ వేట కొనసాగిస్తోంది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ నాయకుడి కుమారుడి పేరును పరిశీలిస్తోంది.

అర్బన్‌లో మాత్రం పోటాపోటీ.. 
ఒక్క నిజామాబాద్‌ అర్బన్‌ స్థానానికి మాత్రం బీజేపీలో గట్టి పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ధన్‌పాల్‌ æసూర్యనారాయణ గుప్తా, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా అర్బన్‌లో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూరల్‌ నియోజకవర్గంలో గడ్డం ఆనంద్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు.

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్మూర్, బాల్కొండ, బోధన్‌ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల సమస్య బీజేపీని వెంటాడుతోంది. ఇక్కడి సీనియర్‌ నేతలంతా పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.

ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా.. 
బీజేపీ ఎంపీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి, తమ బలాన్ని నిరూపించుకోవాలని పార్టీ అధినేత అమిత్‌ షా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న ధర్మపురి అర్వింద్‌ కూడా ఈసారి జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారును లక్ష్యంగా చేసుకుని వినూత్న నిరసనలు, పాదయాత్రలు చేపట్టిన అర్వింద్‌ను ఈసారి ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి కూడా ఆర్మూర్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న బాణాల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు