మున్సి‘పల్స్‌’ : సమగ్ర వివరాలు

25 Jan, 2020 20:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళ్లింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను 8 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. 

కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ జారీ అయింది.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు