హైకోర్టులో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల విచారణ

3 Jan, 2020 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పుడుతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 5 కిలో మీటర్లలోపు ఉన్న ఓటర్లను మరో పోలీంగ్‌ స్టేషన్‌లకు మార్చారని, ఒకే కాలేజీలో 300 ఓట్లను చూపించారని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. సర్వే నెంబరు, ప్లాట్‌ నెంబరుపై ఓట్లను చూపించారని కోర్టుకు వెల్లడించారు. 2014లో ఎలక్షన్‌ షెడ్యూల్‌లో రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌కు 10రోజుల సమయం ఇచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క రోజు మాత్రమే సమయం ఇస్తున్నారని అన్నారు.

ఈ నెల 6వ తేదీన రిజర్వేషన్లు ప్రకటించి 7వ తేదీకే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించారు. కనీసం 10 రోజుల సమయమైన ఇవ్వాని వారు న్యాయస్థానాన్ని కోరారు. 90 శాతం ఎస్సీలను బీసీలుగా చూపిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాగా పిటిషన​ర్ల తరపు వాదనలు కొనసాగుతుండగా.. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు