రామాయంపేటలో 13 సెం.మీ. వర్షపాతం

10 Mar, 2020 02:43 IST|Sakshi

రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు  

సాక్షి, హైదరాబాద్‌: గత 24 గంటల్లో మెదక్‌ జిల్లా రామాయంపేటలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా దోమకొండ, మెదక్‌ జిల్లా మెదక్‌లలో 5 సెం.మీ. చొప్పున, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో, కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట, మాచారెడ్డిలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.
 

మరిన్ని వార్తలు