సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్‌

11 Jul, 2020 03:31 IST|Sakshi

సచివాలయం కూల్చివేత పనులు రెండు రోజులు నిలిపివేయండి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సోమవారం తదుపరి విచారణ

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని సోమవారం వరకూ నిలిపివేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కూల్చివేత లకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. చట్ట ప్రకారం కూల్చివేత పనులకు తీసుకున్న అనుమతుల గురించి పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయ భవ నాల్ని కూల్చివేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం, చట్టానికి వ్యతి రేకంగా ప్రభుత్వం కూల్చి వేతలకు పాల్పడుతోందని భావించినప్పుడు ప్రజలు ఎవరైనా న్యాయస్థానాల్లో సవాల్‌ చేయవచ్చునని స్పష్టం చేసింది. కూల్చివేత చర్యలు 2016లో కేంద్రం జారీ చేసిన నిర్మాణాలు, కూల్చివేత, వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు లేదని వ్యాఖ్యానించింది.

ఆ నిబంధనల్లో 4(3) ప్రకారం అనుమతి తీసుకున్న పత్రాలు సమ ర్పించాలని కోరగా, శనివారానికి విచారణ వాయిదా వేస్తే సమర్పిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం విచారణను 13వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకూ కూల్చివేత లను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

కాలుష్య నియంత్రణ అనుమతి లేదు
పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ...7 లక్షల చదరపు అడుగుల కొత్త భవనాల కోసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాల్ని కూల్చేస్తున్నారని చెప్పారు. 4(3) నిబంధన ప్రకారం కూల్చి వేసేం దుకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోలేదని, పైగా హుస్సేన్‌సాగర్‌ వంటి జలాశ యం దగ్గర కూల్చివేత, నిర్మాణాలు చేయకూడ దని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే కూల్చివేతలు ప్రారంభం అయ్యాయని, మరో మూడు రోజుల్లో మొత్తం భవనాల్ని కూల్చేస్తారని, కూల్చి వేతలను నిలిపివేస్తూ ఉత్త ర్వులు ఇవ్వాలని కోరారు.

కరోనా సమయంలో గాలి కలుషితం అవ్వకూడదనే వైద్య నిబంధనలను, విపత్తుల నిర్వ హణ చట్ట నిబంధనలను, పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు. పూర్తి వివరాల సమర్పణకు విచారణను శనివారా నికి వాయిదా వేయాలని ఏజీ కోరారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం, 4(3) నిబంధన ప్రకారం అనుమతి తీసుకోకుండా కూల్చివేతలకు పాల్పడు తున్నట్లుగా అనిపిస్తోందని, ప్రభుత్వ వివరణపై తాము సంతృప్తి చెందట్లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఎ, బి బ్లాక్‌లను కూల్చేశారని, మరో 3 రోజుల్లో మొత్తం కూల్చేస్తారని, కూల్చివేసిన వాటిలో మతపరమైనవి కూడా ఉన్నాయంది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు