కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో ట్విస్ట్‌..!

28 Jul, 2018 21:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టు​ ఉద్యోగుల సమ్మెలో సందిగ్ధం నెలకొంది. విద్యుత్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమ్మె విరమించామని ప్రకటించగా.. విద్యుత్‌ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం సమ్మె కొనసాగుతుందని ప్రకటించడంతో గందరగోళం మొదలైంది.

ఎందుకిలా..! 
మంత్రి జగదీష్‌రెడ్డితో కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ చర్చలు సఫలమయ్యాయనీ, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నామని యూనియన్‌ నేతలు ప్రకటించారు. కార్మికులంతా విధుల్లో చేరాలని చెప్పారు. కాగా, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తమను చర్చలకు పిలవలేదనీ, సమ్మె కొనసాగుతుందని విద్యుత్‌ కార్మిక సంఘాల జేఏసీ  ప్రకటించింది. రేపు సమావేశమై సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు