బీసీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: ఉత్తమ్‌

28 Dec, 2018 05:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు జనాభా ప్రాతిపది కన రిజర్వేషన్ల కేటా యింపు విషయంలో బీసీ సంఘాలు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. జనాభా ప్రాతిపది కన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నిక ల్లో బీసీలకు కేవలం 22 శాతం రిజర్వేషన్లు కేటా యించారని, దీని వల్ల రాష్ట్రంలోని అనేక గ్రామా ల్లో బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలలో కూడా ఏ, బీ, సీ, డీ, ఈ విభజన ప్రకారం కులాల గణన చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను కేవలం 22 శాతానికి పరిమితం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంఘాలు చేయనున్న నిరవధిక పోరాటాల లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాలు పం చుకోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు