ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న గవర్నర్‌

4 Apr, 2017 02:09 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న గవర్నర్‌

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు   
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరా యించిన ఎమ్మెల్యే లతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్య దర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించు కోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్‌ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించినవారిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాం గాన్ని తూట్లు పొడవడమేనన్నారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ని కలుస్తానని వీహెచ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు