దిగ్విజయ్‌పై కఠినంగా వ్యవహరించాలి

7 May, 2017 02:37 IST|Sakshi
దిగ్విజయ్‌పై కఠినంగా వ్యవహరించాలి

పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు: వెంకయ్యనాయుడు
రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని కార్యకర్తలకు పిలుపు


సాక్షి, హైదరాబాద్‌: ఐసిస్‌కు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నా రంటూ తెలంగాణ పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యా ఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌పై పెట్టిన కేసులో కఠి నంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు మతో న్మాదాన్ని, తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. నక్సల్స్‌ హింసను అణచివేసి, ఇతర రాష్ట్రాలతో రక్షణ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ప్రశం సించారు. శనివారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం కార్యకర్తల సమ్మేళనంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

పార్టీ బలం పెంచుకుందాం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణా దిలోనూ ప్రతి మండలం, తాలుకా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పుంజుకు నేలా కృషి చేయాలన్నారు. కేంద్రం చేపట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అవి సరిగా అమలయ్యేలా జిల్లా, రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే పేదల ఇళ్లను మరిన్ని మంజూరు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమున్నా అభివృద్ధిలో కలసి పనిచేస్తా మన్నారు. తుపాకీ గొట్టంతో అధికారం తప్పు డు ఆలోచన అని, మావోయిస్టులపై సాను భూతి చూపడం సరికాదని పేర్కొన్నారు.

తెలంగాణలో పాగా వేస్తాం..
దేశంలో బీజేపీ గాలి వీస్తోందని, తెలంగాణలో 50% కన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లను, అత్యధికంగా లోక్‌సభ సీట్లను గెలుచుకునే దిశలో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తలు కాషాయం వైపే వస్తారన్నారు. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీ పాగా వేస్తుందని, తెలంగాణలో అధికారంతో అది ప్రారంభమవుతుందని మరో కేంద్ర మంత్రి అర్జున రాం మేఘవాల్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మభ్యపెడుతోందని.. బర్రెలు, గొర్రెల పేరుతో బలహీన వర్గాలను అపహాస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలుచేశారా అన్నది కేసీఆర్‌ చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు, ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి కేసీఆర్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

మరిన్ని వార్తలు