చోరీలకు చెక్‌.. మొబైల్ రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్

27 Oct, 2023 18:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ల దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్‌ చేసుకుని మొబైల్‌ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు టాప్‌ ప్లేస్‌ నిలిచి రికార్డు క్రియేట్‌ చేశారు. 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. 

వివరాల ప్రకారం.. పోగొట్టుకున్న ఫోన్లలో 39 శాతం రికవరీతో దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ సీఐడీ పోలీసులు టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. టెలికాం డిపార్ట్ మెంట్ సీఈఐఆర్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్స్ రికవరీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. దీంతో, హిస్టరీ క్రియేట్‌ చేశారు తెలంగాణ పోలీసులు. 

అయితే, చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టార్‌) పోర్టల్‌ విధానం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్‌ విధానాన్ని డీజీపీ అంజనీకు­మార్‌ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్‌ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత  పూర్తిస్థాయిలో ఏప్రిల్‌ 20 నుంచి ఈ సీఈఐఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్‌ విధానంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్‌ ఫోన్లను సీఈఐఆర్‌ విధానంలో బ్లాక్‌ చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్‌ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 

ఇది కూడా చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్‌ ఆధారంగా..

మరిన్ని వార్తలు