కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి

24 Aug, 2017 02:49 IST|Sakshi
కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి

కేంద్ర మంత్రికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఎగువన ఉన్న రాష్ట్రాలు తెలంగాణకు నీటి విడుదలలో వివక్ష చూపుతున్నాయని ఎంపీ బూర  నర్సయ్య గౌడ్‌ ఆరోపించారు. నీటి వినియోగంపై కేంద్రం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి బుధవారం లేఖ రాశారు. కర్ణాటకలో రిజర్వాయర్లు నిండుగా ఉంటే.. ఏపీ, తెలంగాణలో మాత్రం ఎండిపోతున్నాయన్నారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు కేటాయింపుల కంటే అధిక నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కలసి భువనగిరికి మంజూరైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు