‘లైట్’ వేసి దోచేస్తున్నారు!

27 Nov, 2016 03:07 IST|Sakshi
‘లైట్’ వేసి దోచేస్తున్నారు!

పర్యాటక ప్రాంతాల్లో ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’లో అవకతవకలు
- కాసుల కక్కుర్తితో అధికారుల ఇష్టారాజ్యం
- రూ.కోట్లతో ప్రాజెక్టులు.. లోపభూరుుష్టంగా పనులు
- మూడేళ్లలోపే పడకేసిన వరంగల్ ప్రాజెక్టు
- మళ్లీ మరమ్మతుల పేర భారీ ఖర్చులకు రంగం సిద్ధం
- సరిగా పనులు చేయకున్నా అదే సంస్థకు మరిన్ని ప్రాజెక్టులు
 
 సాక్షి, హైదరాబాద్: అది పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రాజెక్టు.. ఒకటి కాదు రెండు కాదు రూ.మూడున్నర కోట్లతో ఏర్పాటు చేశారు.. కానీ మూన్నాళ్లకే మూతపడింది.. పనిచేసిన కొద్దికాలమూ కిందా మీదా పడుతూ నడిపించారు.. ఇప్పుడు పూర్తిగా పడకేయడంతో మరమ్మతుల కోసం రూ.లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.. చారిత్రక వరంగల్ కోటపై ఏర్పాటు చేసిన ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’ప్రాజెక్టు దుస్థితి ఇది. అంతేకాదు ఇంత నాసిరకంగా పనులు చేసిన సంస్థకే కరీంనగర్ జిల్లా ఎలగందుల కోటపై రూ.3.85 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఇప్పుడు మరో ప్రాజెక్టు పనులు అప్పగించేందుకూ సిద్ధమయ్యారు. మరోవైపు గోల్కొండ కోటలోనూ ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’వ్యవస్థ కూడా దారుణ పరిస్థితికి చేరుకుంది. కాసుల కోసం అధికారుల కక్కుర్తే ఈ పరిస్థితికి కారణమనే ఆరోపణలు వస్తున్నారుు.

 పర్యాటకులను ఆకర్షించేలా..
 గోల్కొండ కోటపై గంభీరంగా అమితాబ్‌బచ్చన్ వారుుస్ ఓవర్‌తో సాగే ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ షోను తిలకించేందుకు ఎంతో ఉవ్విళ్లూరుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఇతర చారిత్రక ప్రాంతాల్లోనూ అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్ర సమయంలోనే నిర్ణరుుంచారు. అందులో భాగంగా మూడేళ్ల కింద వరంగల్ కోట వద్ద ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’ను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.మూడున్నర కోట్లు ఖర్చు చూపారు. కానీ ప్రారంభమైనప్పటి నుంచీ అందులో లోపాలు కనిపించసాగారుు. లైట్లు సరిగా వెలగకపోవటం, ధ్వనిలో స్పష్టత దెబ్బతిని గర్రు.. మంటూ శబ్దాలు రావటం, ఉన్నట్టుండి లైట్లు ఆరిపోవటం, కేబుళ్లు పాడైపోవటం.. దీంతో పర్యాటకులంతా నిరాశకు గురికావడం వంటివి జరిగా రుు. అరుునా అతికష్టమ్మీద ఇటీవలి వరకూ నెట్టుకొచ్చి.. నెలన్నర కింద షోను పూర్తిగా రద్దు చేశారు. అరుుతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన బెంగళూరు సంస్థకు కబురుపెట్టడంతో.. దాని ప్రతినిధులు వచ్చి సాఫ్ట్‌వేర్ లోపాలున్నాయని, ఇతర కేబుళ్లు, పరికరాలు దెబ్బతిన్నాయని, వాటిని మార్చేందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి వెళ్లారు.

 అన్నీ నాసిరకం పరికరాలే..
 అసలు ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే నాసిరకం కేబుళ్లు, ఇండోర్‌లో ఏర్పాటుకు సరిపోయే పరికరాలను ఆరుబయట ఏర్పాటు చేయటం, కొన్ని మాత్రమే ఎల్‌ఈడీ లైట్లు అమర్చి మిగతావి మామూలు బల్బులు బిగించటం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులు కాసుల కక్కుర్తితో అభ్యంతరం చెప్పకుండా బిల్లులు చెల్లించేశారు. సాధారణంగా ఇలాంటి ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులతో పర్యవేక్షణ చేరుుంచాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాజాగా మరమ్మతులంటూ లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.

 అదే సంస్థకు మరిన్ని ప్రాజెక్టులు
 సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు లోపభూరుుష్టంగా ఉంటే ఆ పనులు చేసిన వారికి మరో పని అప్పగించేందుకు తటపటారుుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అదే సంస్థకు కరీంనగర్ జిల్లా ఎలగందుల కోటపై ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’ఏర్పాటు బాధ్యత అప్పగించారు. దానికి దాదాపు రూ.3.8 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు త్వరలో మరో భారీ ప్రాజెక్టును కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.
 
 గోల్కొండ కోటలోనూ..
 గోల్కొండ కోటపై 1993  నుంచి 2014 వరకు లోపాలు లేకుండా ‘సౌండ్‌‌స అండ్ లైట్ షో’ అద్భుతంగా సాగింది. తర్వాత తరచూ మొరారుుస్తుండటంతో మరమ్మతు చేరుుంచి రూ.కోటిన్నర వరకు ఖర్చరుునట్టు చూపారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్లీ మరమ్మతులంటూ రూ.లక్షలు వ్యయం చేసేం దుకు రంగం సిద్ధం చేశారు. అసలు ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థపై అవగాహన లేని అధికారులు దానికి బాధ్యులుగా ఉండడం గమనార్హం. కొందరు ఉన్నతాధికారులు కమీషన్లకు అలవాటు పడి.. సరిగా మరమ్మతులు చేయకపోరుునా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నారుు.

మరిన్ని వార్తలు