విద్యాభివృద్ధితోనే బంగారు తెలంగాణ

26 Aug, 2014 01:45 IST|Sakshi

వారం రోజులు క్షేత్ర స్థాయికి ఉన్నతాధికారులు
జిల్లాలు, స్కూళ్లలో తనిఖీలు, పరిశీలనలు
చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి, 2 నెలలపాటు స్పెషల్ డ్రైవ్
విద్యా బోధన పటిష్టానికి చర్యలు
ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సవూలోచనలు
ఉన్నతాధికారులతో చర్చించాక తుది నిర్ణయం: జగన్నాథరెడ్డి

 
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సవుగ్ర విద్యాభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని  తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ ఎస్ జగన్నాధరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో విద్య రంగంలో చేపట్టవలసిన సంస్కరణలపై సోవువారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయున వూట్లాడారు. మెరుగైన విద్యా బోధన అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.  ‘తెలంగాణ రాష్ట్రం, పాఠశాల విద్య-విద్యా సంస్కరణలు-ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ ఈ సమావేశం నిర్వహించింది. మన ఊరు మన బడి మన పిల్లలు అనే దృక్పథంతో టీచర్లు పని చేయాలని, వివిధ సర్వేలపై పత్రికల్లో కథనాలు వస్తే బాధ పడవద్దని ఆయున సూచించారు. పదేళ్లు చదివిన విద్యార్థికి చదువు రావడం లేదంటే వారి తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఆలోచించి పని చేయాలని పిలుపునిచ్చారు. సదస్సు పూర్తి వివరాలిలా ఉన్నారుు. ప్రభుత్వ పాఠశాలల్లో దిగజారుతున్న విద్యాబోధన, ప్రమాణాలను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని విద్యాశాఖ సోమవారం సంకేతాలిచ్చింది.

ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలోని పర్యవేక్షణ అధికారుల (ఎంఈఓ, డిప్యూటీఈఓ) నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు నెలలో వారం రోజులపాటు పాఠశాలల్లో తనిఖీలు, పరిశీలనలు నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాదు అసర్, ఆర్‌వీఎం, ఎస్‌సీఈఆర్‌టీ వంటి సర్వేల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదని తేలడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇందుకు రెండు నెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. అన్ని స్థాయిల్లోనూ జాబ్ చార్ట్ స్పష్టంగా ఉండాలని, దాని ప్రకారం సంబంధిత అధికారులు పని చేయాలని, పని తీరు సూచికలు ప్రవేశ పెట్టే అంశంపైనా చర్చించింది.  అలాగే ఇవే అంశాలపై జిల్లాల డీఈఓలతోనూ ఈనెల 28న సమావేశం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు