‘ఖిలాపై గులాబీ జెండా ఎగురవేస్తాం’

21 Mar, 2019 13:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

సాక్షి, యాదగిరిగుట్ట : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, యాదగిరిగుట్ట పట్టణ అద్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానికంగా వారు విలేకరులతో మా ట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతను  ఏవిధంగా గెలిపించామో.. అదే విధంగా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకుని సత్తా చాటుతామన్నారు. ఈనెల 23వ తేదీన యాదగిరిగుట్టలో టీఆర్‌ఎస్‌ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్య, అధికార ప్రతినిధి చిత్తర్ల బాలయ్య, ఉపాధ్యాక్షుడు నువ్వుల రమేష్, నాయకులు కోట వెంకటేష్, కాంటేకార్‌ పవన్‌కుమార్, వంగపల్లి అరుణ్, మిట్ట అరుణ్‌గౌడ్, వేముల రవీందర్, కొన్యాల నర్సింహారెడ్డి, బూడిద అయిలయ్య, సయ్యద్‌ బాబా, దావూద్, కృష్ణ తదితరులున్నారు.  

నర్సయ్యగౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
ఆత్మకూరు(ఎం) : భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా బూర నర్సయ్యగౌడ్‌ను రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలుపించాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా భువనగిరి అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్‌ను ఎంపిగా గెలిపించాలని ఆయన కోరారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు