నితిన్​ పెళ్లి ముహూర్తం ఖరారు

18 Jul, 2020 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్​: హీరో నితిన్​, షాలినీల వివాహానికి తేదీ ఖరారైంది. ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్​లో నితిన్​, షాలినీల పెళ్లి వేడుక సింపుల్​గా జరగనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. (తనిఖీకి ఇంకా రెండు గంటల సమయం)

ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌ వారు, స‌న్నిహితులు హాజ‌రుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే.
(ఆ పాత్రకు తను బాగా సరిపోతుందన్నారు: రవీకాంత్‌)

మరిన్ని వార్తలు