ఖైదీ నంబర్‌ 10711

15 Feb, 2017 18:44 IST|Sakshi

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడిన అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ ఖైదీగా మారారు. అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె మరోసారి కటకటాల పాలయ్యారు. బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టులో లొంగిపోయిన ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కూడా లొంగిపోయారు.

తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చడంతో ఆమె సాధారణ ఖైదీగా జైలు జీవితం గడపనున్నారు. శశికళకు జైలు అధికారులు 10711 నంబరు కేటాయించారు. ఇదే కేసులో  శిక్ష పడిన ఇళవరసికి 10712 నంబరు ఇచ్చారు. శశికళ మూడున్నరేళ్లు శిక్ష అనుభవించనున్నారు. ఇప్పటికే ఆమె 6 నెలలు జైలులో గడిపారు.

మరిన్ని వార్తలు