కేజ్రీవాల్‌.. దమ్ముంటే పోటీకి రా!

17 Jan, 2017 16:14 IST|Sakshi
కేజ్రీవాల్‌.. దమ్ముంటే పోటీకి రా!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరిందర్‌ సింగ్‌ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఆయన లంబి నియోజకవర్గంలో  పోటీకి రావాలని సవాల్‌ చేశారు. పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సొంత నియోజకవర్గమైన లంబితోపాటు తన నియోజకవర్గంలోనూ అమరిందర్‌ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లంబిలో సీఎం బాదల్‌ విజయాన్ని సుగమం చేసేందుకు అమరిందర్‌ బరిలోకి దిగారంటూ కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు.

ఈ విమర్శలు కొట్టిపారేసిన అమరిందర్‌ సింగ్‌ దమ్ముంటే లంబి బరిలోకి కేజ్రీవాల్‌ కూడా దిగి.. తమపై పోటీ చేయాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగానే పంజాబ్‌ ఎన్నికల్లో గెలుస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంలో కొత్తగా పార్టీలో చేరిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన స్ప ష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు