రోజూ ఓ గుడ్డు తీసుకుంటే..

2 Nov, 2016 13:21 IST|Sakshi
రోజూ ఓ గుడ్డు తీసుకుంటే..

న్యూయార్క్: ప్రతి రోజూ ఓ గుడ్డు తినడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందట. దీనివల్ల గుండె నొప్పి వచ్చే ప్రమాదం 12 శాతం తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని మిచిగాన్ డొమినిక్ అలెగ్జాండర్ ఆఫ్ ద ఎపిడ్స్టాట్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధన బృందం ఈ విషయాలను వెల్లడించింది.

1982 నుంచి 2015 వరకు ఈ బృందం ఓ పద్ధతి ప్రకారం పరిశోధన చేసింది. గుడ్డు తినని వారికే ఎక్కువగా ఛాతీనొప్పి, ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చినట్టు తేలింది. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని సూచించారు. గుడ్డులో నాణ్యమైన ప్రొటీన్, విలువైన పోషక పదార్థాలు ఉన్నాయని, విటమన్ ఈ, డీ, ఏ ఉన్నాయని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు