స్కూల్లో విద్యార్థి కాల్పులు

17 Mar, 2017 09:49 IST|Sakshi

నీస్‌(ఫ్రాన్స్‌): పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై 17 ఏళ్ల విద్యార్థి కాల్పులకు ప్రయత్నించిన ఘటన గురువారం ఫ్రాన్స్‌లోని కలకలం రేపింది. ఫ్రాన్స్‌లోని గ్రేస్‌ సిటీలోని టకీవిల్లే హైస్కూల్‌లో జరిగిన ఈ కాల్పుల ఉదంతంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రైఫిల్, రెండు తుపాకులు, రెండు గ్రనేడ్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

దాడి జరిగిందన్న భయంతో కొందరు విద్యార్ధులు బయటకు పరుగెత్తి దగ్గర్లోని సూపర్‌ మార్కెట్లో తలదాచుకున్నారు. కాల్పుల ఘటనలో మరొకరి విద్యార్థి ప్రమేయం కూడా ఉందని వార్తలు రావడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పాఠశాలలోని విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు స్పష్టంచేశారు. సిటీలోని అన్ని స్కూళ్లను మూసేశారు. 

మరిన్ని వార్తలు