ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!

24 Oct, 2016 08:07 IST|Sakshi
ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు!

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లకు ఒకేసారి శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఒకేరోజులో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే అవకాశముంది. కాగా ఉత్తరప్రదేశ్లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీకి ఓటమి తప్పదని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల సర్వే వెల్లడించింది. ఇక పంజాబ్లో అధికార శిరోమణి అకాలీదళ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. ఉత్తరాఖండ్లో అధికార కాంగ్రెస్కు షాక్ తప్పదని, బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని సర్వేలో తేలింది.
 

>
మరిన్ని వార్తలు