మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం

17 Aug, 2015 18:27 IST|Sakshi

ఏపూరు(గుంటూరు): ఏపూరు మండలం గుప్మాన్‌తండాలో 12 ఏళ్ల మతిస్థిమితం లేని బాలికపై సోమవారం నాగేశ్వర నాయక్(30) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో అత్యాచారయత్నం చేయబోవడంతో బాలికకేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు సంఘటనస్థలానికి వచ్చే సరికి నిందితుడు పరారయ్యాడు.

బాలికను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు