బ్రేకింగ్‌: మాయావతి రాజీనామా ఆమోదం!

20 Jul, 2017 14:16 IST|Sakshi
మాయావతి రాజీనామా ఆమోదం!

న్యూఢిల్లీ: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ స్వభ్యత్వానికి చేసిన రాజీనామాను పెద్దలసభ గురువారం ఆమోదించింది. మరో ఆరు నెలల్లో ఆమె పదవీకాలం ముగియనుంది. రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడేందుకు తనకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మాయావతి మంగళవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తేందుకు మాయావతి ప్రయత్నించగా.. సభాపతి అడ్డుకున్నారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆమె రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దళితులపట్ల కేంద్రంలోని మోదీ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఆమె రాజీనామాను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీల నేతలు కోరారు. అయినా మాయావతి వెనుకకు తగ్గలేదు. మాయావతి రాజీనామా వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో ఆమె పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

చదవండి: మాయా రాజీనామా.. భారీ వ్యూహం!

మరిన్ని వార్తలు