బావిలో పడిన బస్సు: ముగ్గురు మృతి

24 Nov, 2013 11:47 IST|Sakshi

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయూయి. ఈ దారుణ సంఘటన విరుదునగర్ జిల్లా రాజుపాళయంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరు నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆమ్నీ బస్సు తెల్లవారుజామున 5 గంటలకు రాజపాళయం చేరిం ది. అక్కడ 17 మంది ప్రయాణికులు దిగా రు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత మలుపును వేగంగా దాటబోయింది.


 
 మలుపులో రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఆంటోని (55)ని ఢీకొట్టింది. దీంతోపాటు రాజపాళయం వైపు వెళుతున్న టౌన్ బస్సును ఢీకొట్టి సమీపంలో ఉన్న 50 అడుగుల లోతు బావిలో నిలువుగా పడిపోయింది. చిమ్మచీకట్లు కమ్ముకుని ఉండగా బస్సులోని ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. అకస్మాత్తుగా పెద్దశబ్దం కావడం తో అందరూ కళ్లు తెరిచి చూసి భయభ్రాం తులకు గురయ్యూరు.


 
 ప్రయాణికులంతా భయంతో హాహాకారాలు చేయగా స్థానికు లు వెంటనే పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. బావిలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ముగ్గురిని వెలుపలికి తీశారు. తీవ్రంగా గాయపడ్డ 9 మం దిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు బావి లో రెండు అడుగుల నీరుమాత్రమే ఉండటంతో మరింత ప్రాణనష్టం జరగలేదు. బస్సు డ్రైవర్ చిన్నసామి (35), ప్రయాణికుల్లో కోయంబత్తూరుకు చెందిన సుధన్ (34), తెన్‌కాశీకి చెందిన గణేశన్ (35) మృతి చెందారు.


 
 ఎందరినో మింగిన బావి
 భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలుండే ఈ మార్గంలో పంట పొలాలతోపాటూ పక్కనే ఈ పురాతన బావి ఉంది. 35 అడుగుల చుట్టుకొలత, 50 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ బావికి రక్షణ గోడ లేదు. రోడ్డుపై ద్విచక్రవాహనాల్లో వెళ్లే వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదృష్టం బాగుం డి ఎవరైనా గమనించినా, పగటిపూట ప్రమాదం జరిగితే ఎవరోఒకరు రక్షిస్తుం టారు. లేనట్లయితే బావిలో పడిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులుగానీ, స్థానికులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు