క్యూ2లో తగ్గిన బిజినెస్ సెంటిమెంట్: డీఅండ్‌బీ

15 Apr, 2015 00:26 IST|Sakshi
క్యూ2లో తగ్గిన బిజినెస్ సెంటిమెంట్: డీఅండ్‌బీ

న్యూఢిల్లీ: ఏప్రిల్-జూన్ మధ్య (2015 రెండవ క్వార్టర్) భారత్ బిజినెస్ సెంటిమెంట్ అంతకుముందు త్రైమాసికంతో (జనవరి-మార్చి) పోల్చితే తగ్గినట్లు ఆర్థిక పరిశోధనా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ) అధ్యయనం ఒకటి తెలిపింది. ఏప్రిల్-జూన్‌కు సంబంధించి సంస్థ వ్యాపార ఆశావహ సూచీ (బీఓఐ) 126.8 పాయింట్ల వద్ద ఉంది. జనవరి-మార్చితో పోల్చితే ఇది 2% తక్కువని డీఅండ్‌బీ తెలిపింది. కీలక ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో నెలకొన్న సందేహాలు ఈ సూచీ తగ్గడానికి కారణమని సంస్థ తాజా నివేదిక తెలిపింది. వ్యాపార వర్గాల అభిప్రాయాలు సంబంధిత అంచనాల ప్రాతిపదికన డీఅండ్‌బీ సూచీ కూర్పు ఉంటుంది. సూచీ కూర్పునకు పరిగణనలోకి తీసుకునే మొత్తం 6 విభాగాల్లో - అమ్మకాల విలువ, నికర లాభాలు, విక్రయ ధరలు, ఉద్యోగుల ఆదాయ స్థాయి, కొత్త ఆర్డర్లు, కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు