'ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం'

30 Nov, 2015 12:21 IST|Sakshi
రాజీవ్ శుక్లా

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రాసిన 'శటానిక్ వర్సెస్' పుస్తకంపై రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నిషేధం విధించడం సబబేనని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం వెలువరించిన అభిప్రాయం వ్యక్తిగతమైందని పేర్కొన్నారు. ఆయన ప్రటనకతో తాను విభేదిస్తున్నానని శుక్లా చెప్పారు. తమ అసహనం పెరిగిపోతున్నా ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు అధికార బీజేపీ ఇష్టపడడం లేదని ఆయన విమర్శించారు.

'శటానిక్ వర్సెస్' పుస్తకంపై నిషేధించడం విధించడం తప్పేనని చిదంబరం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు.  ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ... 'సల్మాన్ రష్దీ పుస్తకంపై నిషేధం విధించడం తప్పేనని చెప్పడంలో నాకేలాంటి సంకోచం లేదు' అని వ్యాఖ్యానించారు. చిదంబరం వ్యాఖ్యలను బంగ్లాదేశ్ వివాదస్పద రచయిత్రి తస్రీమా నస్రీన్ సమర్థించారు.

మరిన్ని వార్తలు