తప్పతాగి.. 12 ఆటోలను గుద్దేశాడు!

19 Sep, 2016 09:54 IST|Sakshi
తప్పతాగి.. 12 ఆటోలను గుద్దేశాడు!

ఆ కుర్రాడికి బాగా డబ్బుంది, చేతిలో ఖరీదైన కారుంది.. అంతే, తెగ తాగేసి తన పోర్షే కారుతో ఏకంగా 12 ఆటోలను గుద్దేశాడు. దాంతో ముగ్గురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా, మరో ఆటోడ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ న్యాయవిద్యార్థి (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై కెథెడ్రల్ రోడ్డులో జరిగింది. చాలావరకు ఆటోలు ఎందుకూ పనికిరాకుండా తుక్కుతుక్కుగా మారిపోయాయి. కారు కూడా బాగా దెబ్బతింది.

ఒక్కసారిగా ఏదో కారు బ్రేకులు గట్టిగా వేసిన శబ్దం వినిపించిందని, ఈలోపు తన గుండె భాగంలో దెబ్బ తగిలి ఒక్కసారిగా కళ్లముందు చీకట్లు అలముకున్నాయని, లేచి చూసేసరికి పోలీసులు వచ్చి కారు నడుపుతున్న కుర్రాడిని లేపి తీసుకెళ్తున్నారని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆటోడ్రైవర్ సుందర్ చెప్పారు. ఆ తర్వాత 20 నిమిషాలకు తమను తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సు వచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు