ఫేస్బుక్ బిజినెస్ యాప్ ఇక అందరికీ...

11 Oct, 2016 12:35 IST|Sakshi
ఫేస్బుక్ బిజినెస్ యాప్ ఇక అందరికీ...

శాన్ ఫ్నాన్సిస్కో: సరికొత్త ఆవిష్కరణలతో యూజర్లను ఉత్సాహాన్నిస్తున్న   సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్  తన  తాజా  మొబైల్, బిజినెస్ యాప్ ను అధికారికంగా లాంచ్ చేసి ఇక ధరల యుధ్దానికి తెరలేపింది.  'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే  పేరుతో లాంచ్ చేసిన సర్వీసును   వర్క్ ప్లేస్ పేరుతో  ఇక అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇక దీన్ని వ్యాపార వర్గాల వారందరూ వినియోగించకోవచ్చని మంగళవారం ప్రకటించింది.ఇంటర్నల్ మెయిల్స్, న్యూస్ లెటర్స్ లాంటి పాత టెక్నాలజీకు  ప్రత్యామ్నాయంగా  తమ యాప్  పనిచేస్తుందని  ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ గ్లోబల్ హెడ్ జూలియన్ కోడోర్  నియో తెలిపారు.  దీని ద్వారా  తోటి ఉద్యోగులతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి,  పనిస్థలాల్లో ఉత్పాదకత పెంపుదలకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా  1,000 పైగా సంస్థలు నుంచి వచ్చిన సానుకూల స్పందనతో, ఆయాప్ ను ఏ కంపెనీ లేదా సంస్థకు  అందుబాటులో ఉంచడం చాలా సంతోషంగా ఉందని   ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ను ఐదు దేశాలలో భారతదేశం, అమెరికా, నార్వే,  బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లలో వాడుతున్నారని పేర్కొంది.  వర్క్ ప్లేస్ యాప్ అన్ని కార్పొరేట్లకు , సంస్థలకు అందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.   సంవత్సరకాలంగా ప్రయోగ దశలో ఉన్న ఈ యాప్ ను ఇపుడు   అన్ని వ్యాపార వర్గాల వారికోసం అధికారికంగా లాంచ్ చేసింది. అయితే దీనికి సబ్ స్క్రిప్లన్  చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల ఆధారిత  వర్క్ ప్లేస్ యాప్ కోసం వినియోగదారుడు ఒక డాలర్ నుంచి 3  డాలర్లు చెల్లించాలి.
దీనిసహాయంతో రియల్ టైంలో లో ప్రపంచవ్యాప్తంగా  సహోద్యోగితో చాట్ చేయవచ్చు ఒక గ్రూప్ లో  మేథోమథనం కార్యక్రమం సృష్టించుకోవచ్చు...అలాగే ఫేస్ బుక్  లైవ్లో  సీఈవో ప్రజెంటేషన్  కూడా చూడొచ్చని కంపెనీ  వెల్లడించింది. .డానోన్, స్టార్బక్స్ మరియు బుకింగ్. కాంలాంటి వంటి పెద్ద బహుళజాతి కంపెనీలు, అంతర్జాతీయ  స్వచ్ఛంద సంస్థ ఆక్స్ ఫాం, భారత్ లో ఎస్ బ్యాంక్ , సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక ఏజెన్సీ లు ఈ యాప్ వాడుతున్నట్టు వివరించింది.  
 

 

మరిన్ని వార్తలు