భారత్ వృద్ధి 4.8 శాతమే: ఫిచ్

21 Sep, 2013 02:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్ సంస్థ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను కుదించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 4.8 శాతమని తాజాగా అంచనావేసింది. వృద్ధి రేటు 5.7 శాతమని ఇంతక్రితం జూన్‌లో సంస్థ అంచనా వేసింది. బలహీన డిమాండ్, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను కుదిస్తున్నట్లు ఫిచ్ తన గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను సైతం 6.5 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఫిచ్  తెలిపింది. రూపాయి క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై పడుతోందని విశ్లేషించింది.  
 

మరిన్ని వార్తలు